టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఆ సమయంలో ఓటమి పాలయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెదుక్కోవాలన్నట్టుగా ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంటూ వస్తున్నారు. మంగళగిరిలో ఓటమి పాలయ్యారంటూ వైసీపీ నేతలు ఆయనను ఎన్నో విధాలుగా అవమానించారు. వాటన్నింటికీ నారా లోకేష్ తన విజయంతో సమాధానం చెప్పారు. తానేమీ తన కంచుకోట నుంచి పోటీ చేయడం లేదని.. టీడీపీ వీక్‌గా ఉన్న స్థానం నుంచి పోటీ చేశానని.. తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని లోకేష్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు ఆయన విజయం వైసీపీకి చెంపపెట్టు అని చెప్పాలి.