2004, 2009 ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా గెలుపొందగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2014లో వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి గెలవగా ఆ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2019లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో.. ఆ పార్టీ అధికారంలోకి రాదని అంతా భావించారు. కానీ 25 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గెలవగా రాష్ట్రంలో మెజార్టీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. దీంతో ఉరవకొండ సెంటిమెంట్ బ్రేక్ అయింది.