రాయదుర్గం స్థానిక పైతోటలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ప్రమాదంలో ఓవిద్యార్థి మృతి చెందాడు. పోలీసులు మీడియాకి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గుమ్మగట్ట మండలం వైద్యం గుండ్లపల్లికి చెందిన రామాంజనేయులు కుమారుడు మంజునాథ్ పై తోటలో మేనమామ ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న సమయంలో వైపు వేగంగా వెళుతున్న కారు ఢీకొంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa