ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీగా గెలిచిన వెంటనే బాలీవుడ్‌పై కంగనా రనౌత్ ఫైర్.. తర్వాత పోస్ట్ డిలీట్

national |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2024, 08:46 PM

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి వచ్చినా తన ఫైర్ బ్రాండ్‌ను మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన కంగనా రనౌత్.. తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ ఎంపీల మీటింగ్‌కు వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి వెళ్లిన కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెకప్ వద్ద విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్.. కంగనా రనౌత్‌ను చెంప దెబ్బ కొట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించినా కంగనా.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇదే ఘటనపై బాలీవుడ్‌పై కూడా ఫైర్ అయ్యారు.


అయితే చండీగఢ్ ఎయిర్‌పోర్టులో తనకు జరిగిన చేదు అనుభవంపై బాలీవుడ్ నటీనటుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై కంగనా రనౌత్‌ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బాలీవుడ్‌ నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ను చండీగఢ్‌ విమానాశ్రయంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయోత్సాహంలో ఉన్న ఆమెకు ఈ అనూహ్య పరిణామం షాకిచ్చింది. దీనిపై ఇన్‌స్టా వేదికగా స్పందించిన ఆమె.. తర్వాత తన పోస్టులో కొంతభాగాన్ని తొలగించారు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా బాలీవుడ్ ప్రముఖులు అంతా "ఆల్ ఐస్ ఆన్ రఫా" అని ఉన్న ఫోటోను తెగ వైరల్ చేశారు. అయితే దానిపై స్పందించిన బాలీవుడ్.. తనపై దాడి జరిగితే స్పందించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టిన కంగనా రనౌత్.. ‘‘All eyes on Rafah గ్యాంగ్‌.. ఇలాంటిది మీకు, మీ పిల్లలకు కూడా జరగవచ్చు. ఎవరిపై అయినా ఒక దాడి జరిగితే దాన్ని మీరు వేడుక చేసుకుంటే.. అదే ఘటన మీకు కూడా ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉండండి’’ అని స్టోరీ షేర్ చేశారు. తన మీద జరిగిన దాడిపై మౌనంగా ఉండొచ్చు లేక వేడుక చేసుకుంటూ ఉండొచ్చు కానీ.. భవిష్యత్తులో మీరు మనదేశంలో అయినా, విదేశాల్లో అయిన అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే.. ఇజ్రాయెల్‌ లేక పాలస్తీనాకు చెందినవారు మీపై లేక మీ పిల్లలపై దాడి చేయొచ్చని పేర్కొన్నారు.


ఇజ్రాయెల్ బందీల కోసమో లేక రఫా కోసం మీ అభిప్రాయం చెప్పినందుకు అలా జరగొచ్చని తెలిపారు. అప్పుడు మీ వాక్‌స్వాతంత్ర్యం హక్కుల కోసం తాను పోరాడుతున్నానని గుర్తిస్తారని చెప్పారు. తాను అలాచేస్తున్నందుకు వాళ్లు ఆశ్చర్యపోతారని.. ఎందుకంటే తాను వారి లాగా కాదని వ్యాఖ్యానించారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ను కంగనా రనౌత్ డిలీట్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె స్టోరీని స్క్రీన్‌షాట్ తీసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.


ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు అభ్యర్థిస్తూ బాలీవుడ్ యాక్టర్స్ ‘‘ఆల్‌ ఐస్ ఆన్ రఫా’’ అని రాసి ఉన్న ఒక ఫోటోను ఇటీవల షేర్ చేశారు. అలియా భట్‌, ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్, వరుణ్ ధావన్ సహా చాలా మంది షేర్ చేశారు. అయితే ఆ ఘటనపై స్పందిన వారు.. తనపై దాడి జరిగితే మాత్రం బాలీవుడ్ నటీనటులు స్పందించకపోవడంతోనే కంగనా రనౌత్ ఆగ్రహానికి గురయ్యారని నెటిజన్లు పేర్కొంటున్నారు. గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెకప్ తర్వా.. కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ దాడి చేసింది. దీంతో ఆమెపై కంగన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కుల్విందర్ కౌర్‌ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com