పలాస మండలం, లక్ష్మీపురం వైయస్సార్ ఎంపీటీసీ (వైసీపీ) గోండు మోహన్, ఆయన భార్య, మేనల్లుడు డొంకాన సురేష్ పై టీడిపి కార్యకర్తలు శుక్రవారం రాత్రి దాడి చేశారు. బాధితులు ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ ఎస్. అప్పలరాజు, వైసీపీ నాయకులుతో కలిసి ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. భౌతిక దాడులు సరైన పద్ధతి కాదని, వీటికి స్వస్తి పలకాలనీ కోరారు.