రాష్ట్ర కూరాకుల, పొందరి కుల రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న రాజాపు హైమావతి నేడు రాజీనామా చేశారు. శనివారం ఈ మేరకు ఆమె పత్రిక ప్రకటన చేస్తూ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ చీఫ్ సెక్రటరీ రిజిస్టర్ పోస్టులో పంపించారు. నిరుపేద వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ తనకు ఈ బాధ్యతలు అప్పగించారని వైసిపి ఓటమి తో రాజీనామా చేశారన్నారు.