ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు శనివారం ఉదయం స్వర్గస్తులైన కారణంగా పలాస టిడిపి కార్యాలయంలో నాయకులు ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలబడిన రామోజీరావు కన్నుమూయడంతో రెండు తెలుగు రాష్ట్రాలు బాధతో కుంగిపోయారని మాజీ టిడిపి మంత్రి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ అన్నారు. ఆయన ఆత్మశాంతి కోసం టిడిపి కార్యాలయంలో నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించామనీ తెలిపారు.