ఉపాధ్యాయుల బదిలీల విషయంలో వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ విధానం ద్వారా చేపట్టాలని బాపట్ల ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాసరావు కోరారు. ఎస్టీయూ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి బడుగు శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ, ఏపీజీఎల్‌ఐసీ, సరండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కరోన సమయంలో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు క్యాంపన్సేటివ్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 2024 జూలై నుంచి పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలన్నారు. 117వ జీవోను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి.ఉదయ్‌శంకర్, బి.వెంకటేశ్వర్లు, పివి.నాగరాజు, గవిని శ్రీనివాసరావు, ఎన్‌బి.సుభానీ, ఎవి.నారాయణ, తోటకూర వీరాంజనేయులు, వెంకటరంగం, ఎస్.ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.