చల్లపల్లిలోని శ్రీ ఆర్యవైశ్య సంఘ భవనంలో ఆదివారం ఆర్యవైశ్య యువజన సంఘం 51వ వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా యువజన సంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా తమ్మన సత్యవెంకట సాంబశివరావు, ప్రధాన కార్యదర్శిగా దేసు శివకిషోర్, కోశాధికారిగా ఆలపాటి లోకేష్, ఉపాధ్యక్షునిగా విస్సంశెట్టి మారుతిరామ్, సహాయ కార్యదర్శిగా విస్సంశెట్టి రామహరీష్, కార్యవర్గ సభ్యులుగా జల్లూరి నరేంద్ర ఎన్నికయ్యారు.