దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పేర్కొ న్నారు. భారతదేశ ప్రధానిగా మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీ కారం చేసిన సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య, అసెం బ్లీ కోకన్వీనర్ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె మండల కేంద్రంలో ఆదివారం కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంద ర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి సం బరాల్లో మునిగిపోయారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడు తూ...టీడీపీ, బీజేపీ, జనసేన సారధ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, లక్ష్మయ్య, శంకర్‌రెడ్డి, క్రిష్ణమూర్తి, అప్పిరెడ్డి, రఘునా థరెడ్డి, రాఘవరెడ్డి, సుబ్బయ్య, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర నాయక్, టీడీపీ నాయకులు శశిధర్‌రెడ్డి, సాంబశివారెడ్డి, మ్యూజికల్శివ, చెట్లవా రిపల్లె మధు, అశోక్, రామచంద్ర, రమణారెడ్డి, జగదీష్, వీరాంజినేయు లు, తెలుగుయువత మధుసూదన, పీర్లమాబు, మల్లేష్, శివకు మార్, నాగభూషణం, మురళి, రాజారెడ్డి, మునాఫ్ పాల్గొన్నారు.