మూలపాడు ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఏసీఏ సెంట్రల్ జోన్ పురుషుల సీనియర్ టీ-20 అంతర జిల్లాల క్రికెట్ టోర్నీలో ఎనిమిది పాయింట్ల(నెట్రన్ రేట్ 0.9)తో పశ్చిమగోదావరి జిల్లా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ప్రకాశంపై జరిగిన చివరి మ్యాచ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాట్‌పట్టిన ప్రకాశం 20 ఓవర్లలో 146/4 పరుగులు చేయగా, అనంతరం బరిలో దిగిన పశ్చిమ జట్టు 19.2 ఓవర్లలో 147/6 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. కృష్ణా-గుంటూరు మ్యాచ్‌లో గుంటూరు 3 వికెట్ల తేడా తో ఘన విజయం సాధించింది. కృష్ణా టీమ్ 20 ఓవర్లలో 151/8 పరుగులు చే యగా, గుంటూరు 17.1 ఓవర్లలో 157/7 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. రన్‌రేట్ ఆధారంగా కృష్ణా రెండోస్థానంలో, గుంటూరు మూడో స్థానంలో నిలిచాయి.