మచిలీపట్నం బుట్టాయిపేట సెంటర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. రేపల్లెకు చెందిన మోపిదేవి శ్రీనివాసరావు అనే వ్యక్తి తన భార్య రాజేశ్వరితో కలిసి సోమవారం బందరు మండలం తాళ్లపాలెం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యక్రమానికి వెళ్లారు. నేడు అక్కడి నుంచి బైక్పై రేపల్లెకు తిరిగి వస్తుండగా బుట్టాయిపేట సెంటర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేస్తుండగా బైక్ పై నుంచి రాజేశ్వరి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి కుమారుడితో సహా శ్రీనివాసరావు, రాజేశ్వరి కింద పడిపోయారు. అయితే రాజేశ్వరిపై నుంచి లారీ వెళ్లడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. శ్రీనివాసరావు, అతని కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.