ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానని తాను చేసిన శపధాన్ని ప్రజలు గౌరవించారని.. ప్రజల గౌరవాన్ని నిలపెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం విజయవాడలో కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతీ ఏకరాకు నీరివ్వొచ్చునని, పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతీ ఒక్కరం కృషి చేద్దామన్నారు. అమరావతి రాష్ట్ర రాజధాని అని, విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజావేదికలా విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలన్నారు.