కొవ్వూరు లోని రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ వేసిన గడ్డర్లు భారీ వాహనాలు డీకొని విరిగి పడిపోతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రాత్రి సమయాల్లో వంతెనపై భారీ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. భారీ వాహనాల ఢీకొని బ్రిడ్జికి ఇరువైపులా వేసిన గడ్డర్లు గత నెల రోజులుగా విరిగి కింద పడి ఉన్నాయి. బ్రిడ్జిని పరిరక్షించాల్సిన అధికారుల మధ్య సమన్వయ లోపంతో గోదావరి జిల్లాల ప్రజలు తరచుగా ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందిం చి ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు కం రైలు బ్రిడ్జికి పూర్తిస్థాయి భద్రత కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు.