గత ప్రభుత్వంలో రేషన్ డీలర్లు ఎదుర్కొన్న సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. ఐతవరంలో వసంతను ఆయన నివాసంలో రేషన్డీలర్లు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. మైలవరంలో భారీ మెజారిటీతో గెలుపొందిన ఆయనకు అభినందనలు తెలిపారు. గత ప్రభు త్వంలో ఎదుర్కొన్న సమస్యలను వసంత దృష్టికి తెచ్చారు.