ఆంధ్రప్రదేశ్ జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు ఉండవల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి రాష్ట్రంలో జీడి పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ఏపీసీఎంఏ అధ్యక్షుడు ఫణి రాఘవులు, ఉపాధ్యక్షుడు వాసు, మల్లా కాంతారావు, ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జీడి పరిశ్రమలు సంక్షోభంలో ఉన్నాయని, మద్దతు ధరతో పాటు జీడి పప్పు నకు మార్కెట్ సౌకర్యం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, కార్మికులు, రైతులను ఆదుకోవాలని కోరారు. లోకేష్‌కు జీడి పప్పుమాలతో సత్కరించి అభినందించారు. లోకేష్ స్పందిస్తూ.. జీడి పరి శ్రమలకు మద్దతు ఉంటుందని, భవిష్యత్‌లో ఎటు వంటి సమస్యలు వచ్చినా పరిష్కరి స్తామని హామీ ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి మల్లేసు తది తరులు పాల్గొన్నారు.