ఇచ్ఛాపురం పరిధిలోని ఈదుపురం వంతెనపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన నీలాపు సంతోష్‌కుమార్ గ్రామం నుంచి ద్విచక్ర వాహనం పై ఇచ్ఛాపురం వస్తుండగా, అదే గ్రామానికి చెందిన నందూరి ఢిల్లేశ్వర్ అలియాస్ శంకర్ (42) ఇచ్ఛాపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరిని చికిత్స నిమిత్తం ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఢిల్లేశ్వర్ మృతి చెందగా.. సంతోష్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఢిల్లేశ్వర్ ఒడిశాలోని పితాతోళి గ్రామంలో ఓ ప్రైవేట్ కంపెనీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.