బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ప్రత్యేక విభాగమైన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2002లో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించింది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి, వారిని పనిలో కాకుండా బడిలో చేర్పించేందుకు, మంచి పౌష్టికాహారం అందించి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు.