ఇక, ఒడిశా సీఎంగా బాధ్యతలు చేపట్టిన గిరిజన నేత మోహన్ చరణ మాఝి.. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన మాఝి.. విద్యార్ధి దశ నుంచే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపట్ల ఆకర్షితులయ్యారు. సరస్వతి విద్యామందిర్‌లో ఉపాధ్యాయుడిగా.. లాయర్‌గా పనిచేశారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచిగా, బీజేపీ గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కేంఝార్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు (2000, 2009, 2019, 2024)లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్ విప్‌గా విధులు నిర్వహించారు.