ఏపీలో వైసీపీ నేతలు, వైఎస్ విగ్రహాలపై జరుగుతున్న దాడుల్ని ఆపించాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఓ లేఖను విడుదలచేశారు. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నామని లేఖలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa