టిడిపి నాయకుల ప్రలోభాలకు ఎవరూ లొంగవద్దని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని మున్సిపల్ చైర్ మెన్ వరప్రసాద్, వైస్ చైర్ మెన్ వైస్ మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో బుధవారం కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైసీపీ ఓటమి చాలా బాధాకరమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. అభివృద్ధికి సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్ ఏర్పాటు చేసిన పాడా ఉండకపోవచ్చు అని తెలిపారు.