అన్ని దానాల్లో రక్తదానం మిన్న అని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చెప్పారు. శుక్రవారం చీరాల ఏరియా హాస్పిటల్ లో ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ శిబిరంలో రక్తదానం చేశారు. అనంతరం కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ ట్రైనింగ్ లో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుభాషిణి కూడా పాల్గొన్నారు.