అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు విద్యుత్ శాఖ ను కేటాయిస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాబితాను విడుదల చేశారు. అత్యంత కీలకమైన విద్యుత్ శాఖను రవికుమార్ కు కేటాయించటం పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తగిన ప్రాధాన్యత ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.