వేంపల్లెలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు. గురువారం ఎంఈవో 2 స్టాలిన్ ను ఆయన కలిసి వినతిపత్రం అందించారు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25శాతం సీట్లు పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుతాయన్నారు. ప్రైవేటు పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు కొనాలని చెబుతూ అధిక ధరలు వసూలు చేయడం దారుణం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa