ఈ నెల 9న జమ్మూలోని వైష్ణవి దేవి దైవదర్శనానికి వెళ్లి వస్తున్న భక్తులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపడం దారుణమని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చీతిరాల నాగార్జున పేర్కొన్నారు. తీవ్రవాదుల కాల్పులను నిరసిస్తూ గురువారం ప్రొద్దుటూరు స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద వీహెచ్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మల్లిఖార్జున రావు, మార్కండేయ, చలపతి, దశమందం బాబు, సురేష్, చౌడయ్య, తదితరులు పాల్గొన్నారు.