అనారోగ్యంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా, పోలాకి మండలం పల్లిపేట గ్రామానికి చెందిన ఆబోతుల లక్ష్మయ్య(57) శ్రీకాకుళం టూ టౌన్ పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బందోబస్తు నిర్వహిం చేందుకు విజయవాడ వెళ్లాడు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చేందుకు విజయవాడ బస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురై స్పృహ తప్పి పడిపోయాడు. తోటి పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం వేకువ జామున ఆరోగ్యం క్షీణించి ఆ స్పత్రిలోనే ప్రాణాలు విడిచాడు. లక్ష్మయ్య భౌతికకాయాన్ని గురువారం రాత్రి స్వగ్రా మానికి తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. కా గా, లక్ష్మయ్య ఏఆర్‌లో పని చేసేవాడు. అక్కడ నుంచి కోటబొమ్మాళి పోలీసు స్టేషన్ లో 2019 నవంబరు వరకు పనిచేసి.. శ్రీకాకుళం టూ టౌన్ పోలీసు స్టేషన్‌కు బదిలీ పై వచ్చాడు. లక్ష్మయ్యకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకు న్న టూటౌన్ సీఐ ఉమామహేశ్వరరావు, సిబ్బంది దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.