తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల ఆటలు మితిమీరాయి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్యాష్ పేమెంట్స్ నిలిచిపోయి, ఆన్‌లైన్ పేమెంట్స్ కొనసాగుతుండటంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.క్యూ ఆర్ కోడ్స్, లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కాజేస్తున్నారు. అదేవిధంగా లోన్లు ఇస్తామని, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పేరుతో నిండా ముంచేస్తున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లాలో సైబర్ నేరగాడు జూలురు సూర్య అనే వ్యక్తి ఇండియ బుల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.50 వేలు లోన్ ఇస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. మొదట ఇన్సూరెన్స్ రూ.3,250 కట్టాలని చెప్పగా.. అది నిజమేనని నమ్మిన సూర్య గూగుల్ పే చేశాడు. అనంతరం లోక్ అప్రూవ్ అయిందని అందుకు సంబంధించిన స్టాంప్ పేపర్‌తో పాటు సైబర్ నేరగాడి ఫేక్ ఎంప్లాయ్ ఐడీ, ఆధార్, పాన్ వాట్సాప్ చేశాడు. లోన్ అమౌంట్ అకౌంట్లోకి జమ కావాలంటే రూ.12,164 చెల్లించాలని చెప్పగా బాధితుడు మళ్లీ ఫోన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు. కాగా, అకౌంట్‌లో రూ.50 వేలు జమ కాలేదని గ్రహించిన సూర్య సైబర్ నేరగాడి చేతిలో తాను మోసపోయానని గ్రహించి పోలీసుకు ఫిర్యాదు చేశాడు.