అమాయకురాలైన దివ్యాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. ఈ ఘటనపై శుక్రవారం ప్రకాశం జిల్లా, చీమకుర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు లో బాధితురాలు గుర్తించిన మేరకు ముగ్గురు అనుమానితులను పోలీసులు అదు పులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలపరిధిలోని చండ్రపా డులో మాటలు రాని, వినపడని యువతిపై గత మూడు నెలలుగా అఘాయిత్యం జరుగుతున్నట్లు బయటపడింది. ఆ యువతి గర్భిణీ అని తేలటంతో నివ్వెరపోయి న ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీ సులు యువతి గుర్తించిన మేరకు అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు అవివాహి తుడు కాగా ఇద్దరు వివాహితులు. ఈ ఘటన గ్రామంలో సంచలనం రేపుతోంది. బాధితురాలికి అసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర వి చారణ జరుపుతున్నామని సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa