ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. టూరిస్టులతో రోడ్డుపై వెళ్తున్న ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్నవారు బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేడి కారణంగా మంటలు వ్యాపించినట్లు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa