పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఇద్దరిపైనా విడివిడిగా రౌడీషీట్లు తెరిచినట్టు గురజాల డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఇక నుంచి వారిపై నిరంతరం నిఘా ఉంటుందని వివరించారు. రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం సహా 14 కేసులు నమోదయ్యాయని, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా హత్యాహత్నం సహా 9 కేసులు నమోదైనట్టు వివరించారు.