గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు రెండు శాతం కూడా పూర్తి చేయలేదని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబు చేసిన ప్రాజెక్ట్ పనులను జగన్ విధ్వంసం చేశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో కక్షసాధింపు చర్యలు, విధ్వంసం మాత్రమేనని.. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా లేదని చెప్పారు. వైసీపీ అబద్ధాలు, అసత్యాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ సీజన్‌లో కొన్ని మార్పులు వస్తుంటాయని చెప్పుకొచ్చారు.