ముదిగుబ్బ మండలం ఆకుతోటపల్లి గ్రామంలో చేతిపంపు బాగు చేయకపోవడంతో నిరుపయోగంగా మారింది. పంచాయతీ బోరు నుంచి సరఫరా అయ్యే నీరు ఎస్సీ కాలనీకి పూర్తి స్థాయిలో అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేతి పంపు బాగుచేస్తే నీటి సమస్య తీరుతుందని కాలనీవాసులు మంగళవారం కోరారు. సమస్యను ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్ వివరణ కోరగా మరమ్మతులకు గురైన చేతిపంపును త్వరలోనే బాగుచేయించి నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు.