కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్టు చివరికి టమోటా పంటలో సైతం దొంగలు పడి కాయలను కోసుకెళ్లిన సంఘటన కడప జిల్లా, బి.కొత్తకోట మండలంలో చోటు చేసు కుంది. మండలంలోని గట్టు పంచాయతీ గుట్టపాళ్యంకు చెందిన నీరుగట్టి రమణారెడ్డి, జి సిద్దారెడ్డిలు చెరో రెండు ఎకరా లలో టమోటా సాగుచేశారు. పంట బాగా పండి కోతలు పడు తున్నాయి.. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో ప్రతిరోజు కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటున్నారు. సోమవారం రాత్రంతా చిరుజల్లులు పడ్డాయి. దీంతో రైతులు తోటవద్దకు పోలేదు. ఇదే అదనుగా భావించి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోనికి చొరబడి సుమారు రూ.లక్ష విలువ చేసే 70-80 బాక్సుల టమోటాలు కోసుకెళ్లారు. మంగళవారం ఉదయాన్నే కాయలకోతకు కూలీలతో వెళ్లి చూడగా తోటలో ఓ వైపు పూర్తిగా కాయలను కోసుకెళ్లినట్లు గుర్తించినట్టు బాధిత రైతులు తెలిపా రు. ఆరుగాలం కష్టపడి, రూ.లక్షలు వెచ్చించి సాగుచేసిన పంట ను రాత్రిళ్లు కూడా కాపలా కాయాల్సి వస్తోందని వారు వాపో యారు.
![]() |
![]() |