మహిళా స్వయంశక్తి సంఘాల్లోని సభ్యులు ఆదాయాభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వెలుగు ఏపీఎం పైడి కూర్మారావు సూచించా రు. మంగళవారం ఆమదాలవలస మండలంలోని సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద గల తులగాం ఆర్‌ఆర్ కాలనీలో సర్పంచ్ సొండి దమయంతి ఆధ్వర్యంలో స్వయం శక్తి సంఘాల సభ్యులకు అవగాహన కార్య్రకమం నిర్వహించారు. కార్యక్రమం లో ఎంపీటీసీ బండి ప్రభావతి, గ్రామ పెద్దలు గొర్లె రాఘవదాసు, నారాయణ దాసు, కృష్ణమూర్తి, క్లస్టర్ కోఆర్డినేటర్ రామప్పడు, వీవో రేవతి, గ్రామ సంఘం అధ్యక్షు రాలు లంక చిన్నమ్మి, తదితర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
![]() |
![]() |