'రాహుల్.. మీ నిబద్ధత, నిజాయతీ, ప్రజలకు మేలు చేయాలన్న మీ తపన ఎంతో మెచ్చుకోదగ్గది. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీరు తుడవడానికి మీరెప్పుడూ ముందుటారు. ఈ మిషన్ ఇలాగే కొనసాగాలి. భిన్నత్వం, సామరస్యం, కరుణ అనేది కాంగ్రెస్ పార్టీ తత్వం. ఇవన్నీ మీ పనుల్లో కనిపిస్తాయి. సడలని పట్టుదలతో రాజ్యాంగ పరిరక్షణ కోసం మీరు పోరాడారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా'అని ఖర్గే తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. 'ప్రియమైన సోదరుడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దేశ ప్రజల పట్ల మీకున్న అంకితభావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మీరు నిరంతర పురోగతి సాధిస్తూ.. విజయం మీ కేరాఫ్ కావాలని కోరుకుంటున్నా' అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 'నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ నా స్నేహితుడు, నా తోటి యాత్రికుడు, మార్గదర్శి, తత్వవేత్త, గొప్ప నాయకుడు' అని ప్రియాంక గాంధీ ప్రశంసించారు.