ఈవీఎంల కారణంగానే జేడీఎస్, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బీబీఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ ద్వారా ఓటింగ్ రావాలని అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసినందున ఏమి చేయడం సాధ్యం కాదన్నారు. మరోసారి ఫలితాలను పరిశీలించవచ్చు అన్నారు. మధ్యప్రదేశ్‌లో బ్యాలెట్ ఓటింగ్ ఉన్నప్పుడు మూడింట రెండొంతులు కాంగ్రె్‌సకు వచ్చేవని, ఈవీఎంల కారణంగా పరిస్థితుల్లో మార్పు వచ్చిందని అన్నారు. వీటిపై సమగ్ర పరిశోధన జరపాల్సి ఉందన్నారు. బీబీఎంపీ ఆస్తులను తాకట్టుపెట్టే విషయమై మీడియా ప్రశ్నకు సమాధానంగా బీబీఎంపీ ఆస్తుల రక్షణ సమీక్ష జరుపుతామన్నారు. కాంట్రాక్టుకు ఇచ్చిన అనుమతులను రెన్యూవల్ చేస్తామన్నారు. బీబీఎంపీలో ప్రకటనల నిబంధనలు వారం రోజుల్లో తీసుకొస్తామన్నారు.