ధర్మవరం మండలం వ్యాప్తంగా ఇంతవరకు 4139 మంది రైతులకు గాను 3800 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ చేయడం జరిగిందని బుధవారం వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. కందులు అవసరమైన రైతులు రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేసుకోవాలని నాలుగు కేజీల కందుల ప్యాకెట్లు అందుబాటులో కలవని తెలిపాడు. సబ్సిడీ ధరపోను రైతులు 392 రూపాయలు ప్యాకెట్ కు చెల్లించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులకు వ్యవసాయ అధికారి సూచించాడు.