వైసీపీ పాలనలో స్టాక్ పాయింట్లగా పెట్టిన ఇసుకను ఎవరెవరో ఎత్తుకుపోతున్నారని, కొత్త ఇసుక విధానం అమలులోకి వచ్చేవరకూ ఎక్కడి ఇసుకను అక్కడే ఉంచాలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్‌చార్జి అనుశ్రీ (అత్తి) సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లాలాచెరువు స్టాక్ పాయింట్ నుంచి అధికారులెవరో అనుమతిచ్చారని, ఎవరో అమ్మేసుకుంటున్నారన్నారు. ముందు అధికారులు జిల్లాలో ప్రస్తుతం స్టాక్ పాయింట్లలోనూ, గోదావరి ర్యాంపుల గట్టు మీద ఎంత ఇసుక ఉందో లెక్కలు తెలియజేయాలని, జిల్లాలో సుమారు స్టాక్‌లలోనే 6 లక్షల టన్నుల ఇసుక ఉంటుందని, ఇక ర్యాంపులలో మరింత ఇసుక రాశులు ఉన్నాయని ఆయన అన్నారు. అధికారులు జోక్యం చేసుకుని, వెంటనే ఈ ఇసుక తరలిపోకుండా ఆపాలని సత్యనారాయణ కోరారు.