కడప జిల్లాలో అద్దె ఆర్టీసీ బస్సులతో తరచూ ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 16వ తేదీన కడప శివారులో స్కూటీని ఢీకొనగా ఇద్దరు మృతి చెందారు. మరుసటి రోజే కడప డిపోకు చెందిన అద్దె ఆర్టీసీ, కారును ఢీకొనగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మొత్తంగా చూసుకుంటే 2024 జనవరి నుంచి జూన్ 17 వరకు ఎనిమిది ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవ్వగా. ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయాల పాలయ్యారు.