గుంతకల్లులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తూ, అక్రమంగా అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం పుస్తకాలను ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉంచి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి వెంకి, నాయకులు కిషోర్, చరణ్, అశోక్, వంశీ, దాదా తదితరులు పాల్గొన్నారు.