టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి , సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖా మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లో మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అధనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఆ సీట్లను రద్దు చేశారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa