టీడీపీ నేత డోలా బాల వీరాంజనేయస్వామి, సాంఘిక సంక్షేమం, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం, సచివాలయం, విలేజ్ వాలంటీర్ల శాఖా మంత్రిగా బుధవారం సచివాలయంలోని మూడవ బ్లాక్‌లో మంత్రిగా భాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని, తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అధనపు సీట్లు ఇచ్చామని, గత ప్రభుత్వంలో జగన్ ఆ సీట్లను రద్దు చేశారని ఆరోపించారు. అవి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని, సింగరాయకోండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారని, వాటిని తిరిగి పునరుద్దరిస్తు తోలిసంతకం చేశానని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును హట్ వాటర్ కోసం మంజూరు చేశామని, అక్కడే పాఠశాలలకు అందించే పళ్ళు, కూరగాయలు, గుడ్లు నిల్వకు కోల్డ్ స్టోరేజి రూమును రూ. 9 లక్షలతో పైలెట్ ప్రాజెక్టు కింద ఇస్తున్నామన్నారు.