విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలంలో గతంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై జూలై 9న ప్రజా వేదిక నిర్వ హించనున్నట్టు ఎస్‌ఆర్‌పీ బి.దాసు తెలిపారు. 18వ విడత పనుల తనిఖీలకు డీఆర్పీలు, వీఎస్‌ఏలతో కూడిన ఏడు బృందా లను నియమించామని చెప్పారు. ఈ బృందాలు సోమవారం నుంచి పనుల పరిశీలన చేస్తున్నాయని తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 25 పంచాయతీల్లో 728 పనులు నిర్వహించారని తెలిపారు. కూలీల వేతనాల కోసం రూ.16,57,26,271, మెటీరియల్‌కు రూ.20,04,569 చెల్లించినట్లు చెప్పారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 20 పనులకు రూ.2,33,14,298, పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఆరు పనులకు రూ.18,28,550 నిధులు వ్యయం జరిగిందన్నారు. మొత్తం పనులకు సుమారు రూ.20 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిశీలనతో పాటు వేతనదారుల నుంచి సమాచారం తెలుసుకుని తదు పరి గ్రామసభలు నిర్వహణ ఉంటుందన్నారు. తనిఖీలు పక్కాగా నిర్వహిం చి లోపాలు ఉన్నట్లయితే అవసరమైన నివేదికలను తగు చర్యలు నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు.