పలాస రైల్వే స్టేషన్ తాళభద్ర రైల్వేగేటుకు కిలోమీటరు దూరంలో రైల్వేట్రాక్ పక్కన ఉన్న వరద కాలువలో పడి ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెళ్లి అతడిని అతి కష్టం మీద స్ట్రెక్చర్‌పై తీసుకువెళ్లి ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం షాలిమార్ - సికింద్రాబాద్ ఫలక్‌నుమా రైలు నుంచి జారిపడి అసోంకు చెందిన ఇంద్ర బహుదూర్ బోరో అనే వ్యక్తి కాలువలో పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. రైల్వే సిబ్బంది ఆతడిని గుర్తించి 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. గేటు వద్ద అంబులెన్స్‌ను పెట్టి కాలి బాటన రైలు ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లి అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.