కృష్ణామిల్క్ యూనియన్ ద్వారా సూపర్ నేపియర్ పచ్చగడ్డి విత్తనాలను సబ్సిడీపై పాడిరైతులకు అందజేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ చైర్మన్ చలసాని ఆం జనేయులు పేర్కొన్నారు. కాకుల పాడు పాలసొసైటీ ఆవరణలో శుక్రవారం పాడిరైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సబ్సిడీపై పచ్చగడ్డి విత్తనాలు, దాణా అందించడంతో పాటు మేలు జాతి పశు వుల కొనుగోలుకు యూనియన్ సహకారం అందిస్తోందనన్నారు. ప్రస్తుతం పచ్చగడ్డి దొరకడం లేదని రైతులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని కొన్ని పొలాలు, మాన్యం లీజుకు తీసుకుని, పశుగ్రాసాన్ని పెంచుకోవాలని రైతులకు చలసాని సూచించారు.