రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌరసరఫరాల శాఖపై ఆయన రెండో రోజు సమీక్ష నిర్వహించారు. 'కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయి. రేషన్ మాఫియా అక్రమాలపై సీఐడీ విచారణ కోరుతాం. కాకినాడలో తొలిరోజు తనిఖీల్లో ఆరు గోదాముల్లో 7,165 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ నిల్వలు గుర్తించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం' అని తెలిపారు.