దేశ చరిత్రలో పింఛన్ కార్యక్రమం నిలిచిపోతుందని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.ఈసందర్భంగా సోమవారం డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, వై నాగేశ్వరరావు యాదవ్ తెదేపా, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని బుర్గాల, కవులపల్లె, సీతమ్మ తాండ, రాచర్ల నేరేడుచర్ల గ్రామాలలో పింఛన్ పంపిణీ నిర్వహించారు.