నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈరోజు (మంగళవారం) పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండీషన్లో ఉంచుకోవాలని ఆదేశించారు. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.