కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్. అండ్. బి గెస్ట్ హౌస్ లో ఐక్య విద్యార్థి సంఘాలు బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఎస్. ఎఫ్. ఐ ఉపాధ్యక్షుడు వంశీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి, నీట్ పరీక్షను, ఎన్టిఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలన్నారు. జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
![]() |
![]() |