ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్, నారాయణ స్వామి బుధవారం తెలిపారు. వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు పగటి వేళ 35. 5 డిగ్రీల నుంచి 36. 6 డిగ్రీలుగా, రాత్రి వేళ 25. 6 డిగ్రీల నుంచి 26. 2 డిగ్రీలుగా నమోదయ్యే సూచనలు ఉన్నాయన్నారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
![]() |
![]() |